హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం

HYD: బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మరీలో ఆయుధాల చోరీ కేసులో అరెస్టైన మాజీ హవల్దార్ మల్లేశ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. వైద్య పరీక్షల్లో లివర్, కిడ్నీ సమస్యలు ఉన్నట్లు తేలడంతో చికిత్సకు తరలించారు. కాగా మల్లేశ్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ బొల్లారం పోలీసులు స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరగాల్సి ఉంది.