ASR: హుకుంపేట వార సంత వద్ద తాగునీటి కోసం బోరు తవ్వి ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు మోటారు బిగించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు, వ్యాపారస్థులకు నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి బోరుకు మోటారు బిగించి నీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బోరు తవ్వి ఏడాదైనా.. మోటారు బిగించరా?


