పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన డీజే శబ్దానికి ఇమాంబి (56) అనే మహిళ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీజేపై నిషేధం ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతోనే ఘటన జరిగినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
డీజే శబ్దంతో మహిళ మృతి


