హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

NLR: అనంతసాగరం మండలం నుంచి నెల్లూరుకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు బుధవారం నువ్వురు పాడు వద్ద బ్రేక్ సమస్య తలెత్తింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, బస్సును నెమ్మదిగా ప్రక్కకు నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో తరలించారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు.