హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిండుతున్న చెరువులు.. రైతన్న హర్షం!

BHPL: జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు నిండుతున్నాయి. కొన్ని చెరువులు మత్తడి పోస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మహాముత్తారంలో అత్యధికంగా 61.4 మి.మీ, గణపురంలో అత్యల్పంగా 10.2 మి.మీ వర్షం పడింది. అయితే, కొన్ని రోజులుగా పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొనగా.. ఈ వర్షాలతో మరికొన్ని రోజులు సాగు నీటి ఇబ్బందులు తప్పనున్నాయి.