హైదరాబాద్: 28°C
తెలంగాణ

తోటపల్లి గ్రామంలో వర్షానికి కూలిన ఇల్లు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో వర్షానికి ఇల్లు కూలిపోయింది. హనుమాన్ టెంపుల్ సమీపంలో నివాసం ఉంటున్న పోలు పద్మ-రాజయ్య దంపతుల ఇల్లు మొన్న కురిసిన వర్షానికి తడిసి, నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో కురిసిన వర్షానికి కూలిపోయింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.