హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కల్వకుర్తిలో పందుల స్వైర విహారం

NGKL: కల్వకుర్తి పట్టణంలోని పలు కాలనీలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. పందులు గుంపులు గుంపులుగా సంచారం చేస్తూ కాలనీలో మురికి గుంతలుగా తయారు చేస్తున్నాయని, ఇళ్లల్లోకి ప్రవేశిస్తూ అపరిశుభ్రంగా మారుస్తున్నాయని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోగాలు వచ్చే అవకాశం ఉందని, మున్సిపల్ అధికారులు స్పందించి పందులను నివారించాలని కోరుతున్నారు.