హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు వంగూరులో బైక్ ర్యాలీ: సీపీఎం

NGKL: వంగూరు మండలంలో గురువారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సీపీఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పార్టీ మండల కార్యదర్శి బండపల్లి బాలస్వామి తెలిపారు. ఉదయం 8 గంటలకు జాజాల గ్రామంలో ఈ ర్యాలీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. మండల కమిటీ సభ్యులు, శాఖల కార్యదర్శులు, కార్యకర్తలు విశేషంగా పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.