హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళా ప్రాంగణానికి కొత్త హంగులు'

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కస్టమ్ హైరింగ్ సెంటర్, కమ్యూనిటీ మేనేజ్డ్ ట్రైనింగ్ సెంటర్, జెండర్ రిసోర్స్ సెంటర్లను ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ లంక శ్యామల రావు మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు ప్రభుత్వం పలు అవకాశాలు కల్పిస్తుందన్నారు.