హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృథాగా మిషన్ భగీరథ నీరు.. పట్టించుకోని అధికారులు!

NLG: పెద్దవూర మండలం పోతునూరు పరిధిలో మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి రోజుల తరబడి తాగునీరు రోడ్లపై వృథాగా పారుతోంది. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులకు నీటి సరఫరా నిలిచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి పైపులకు మరమ్మతులు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.