జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డులో బుధవారం ఉదయం మహిళ హత్యకు గురైంది. ఉదయం 7 గంటల సమయంలో ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మృతురాలిని అంగన్‌వాడీ కార్యకర్త అన్నం లక్ష్మిగా గుర్తించారు. భర్తే ఆమెను హత్య చేసినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. అనంతరం భర్త అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
కోరుట్లలో మహిళ హత్య.. భర్త పరార్!


