హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెన్షన్ల నమోదుకు గడువు పెంపు

శ్రీకాకుళం: ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల నమోదు గడువునేటితో ముగియనుండగా మరో రెండు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సర్వర్స్ మోరాయించడం, ధ్రువపత్రాల జారీలో జాప్యం వంటి సమస్యల కారణంగా గడువు పెంచాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా శుక్రవారం వరకు అర్హులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కలిగింది.