హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిన్నశేష వాహనంపై కళ్యాణ వెంకన్న

TPT: తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం స్వామివారు చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా మాజీ ఛైర్మన్ మోహిత్ రెడ్డి పాల్గొన్నారు.