హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జ్యోతికి ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి

VSP: జ్యోతి యర్రాజీకి మంత్రి లోకేశ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఎంతోమంది యువ క్రీడాకారులకు ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈనెల 25, 26 తేదీల్లో ఏషియన్ గేమ్స్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె బరిలోకి దిగనున్నారు. భారత్‌కు ఘనత తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్రం మొత్తం జ్యోతికి అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.