హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కలెక్టరేట్‌లో DVMC సమావేశం

చిత్తూరు జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని గురువారం కలెక్టరేట్‌లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారిత అధికారి రబ్బానీబాషా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అఘాయిత్యాల నిరోధక చట్టం అమలుపై కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఉంటుందన్నారు. నిఘా, పర్యవేక్షణ కమిటీ సభ్యులందరూ తప్పక హాజరుకావాలని కోరారు.