హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ వైర్లకు పాకిన తీగలు.. స్థానికుల్లో ఆందోళన

RR: కర్మన్‌ఘాట్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నంబర్ 1/A హనుమాన్ టెంపుల్ లైన్ వద్ద విద్యుత్ వైర్లకు తీగలు పాకి స్తంభం పైకి ఎక్కాయి. గాలిదుమారం సమయంలో తీగలు విద్యుత్ వైర్లను తాకి షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తీగలను తొలగించాలని కోరుతున్నారు.