హైదరాబాద్: 28°C
తెలంగాణ

నంగునూరులో కొండచిలువ కలకలం

SDPT: నంగునూరు నల్లపోచమ్మ ఆలయం సమీపంలో కొండచిలువ సంచారం కలకలం రేపింది. నంగునూరు-అంక్షాపూర్ ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి వాహనదారులు కొండచిలువను గమనించారు. అది రోడ్డు దాటే వరకు వాహనాలను నిలిపివేసి భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతం నుంచి వచ్చి ఉండొచ్చని అటవీశాఖ అధికారులు తెలిపారు.