MNCL: భార్య ముక్కును భర్త కొరికిన ఘటన కోటపల్లిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోటపల్లికి చెందిన మమతకు మణిచందర్‌తో వివాహమైంది. కొన్నేళ్లుగా అదనపు కట్నం కోసం మణిచందర్ తన భార్యను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం మణిచందర్ తన మామపై దాడి చేశాడు. అడ్డు వచ్చిన భార్య ముక్కును బలంగా కొరికాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్యను చికిత్సకై వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
కోటపల్లిలో భార్య ముక్కును కొరికిన భర్త


