హైదరాబాద్: 28°C
తెలంగాణ

బైక్‌ ప్రమాదంలో వ్యక్తి మృతి!

NZB: ఇందల్వాయి మండలంలోని మెగ్యనాయక్ తండాకు చెందిన లాకావత్ పరశురాం (40) అలియాస్ రామ్సింగ్ నిన్న రాత్రి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై సుమలత ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.