MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తండాలో లేగ దూడపై రాత్రి చిరుత పులి దాడి చేసినట్లు సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి తెలిపారు. తండాకు చెందిన లంబాడి రాజు మంగళవారం రాత్రి తన పశువులను వ్యవసాయ పొలం వద్ద కట్టేసినట్టు తెలిపారు. రాత్రి సమయంలో చిరుత పులి దాడి చేసి లేగ దూడను చంపినట్లు వివరించారు. బుధవారం ఉదయం గుర్తించిన రాజు అటవీ అధికారులకు తెలిపారు.
తెలంగాణ
లేగ దూడపై చిరుత పులి దాడి


