హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రతిష్టించకుండానే గణేశుడి నిమజ్జనం

రంగారెడ్డి జిల్లా చౌదరిగూడెం మండలం పీర్జాపూర్‌లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించకుండానే నిమజ్జనం చేసిన ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించే విషయంలో ఆలయంలో ప్రతిష్ట వద్దని కొందరు.. ఆలయంలోనే ఏర్పాటు చేస్తామని మరికొందరు పట్టుపట్టారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుని చివరకు గుడిలో విగ్రహం ఏర్పాటుకు వీలుకాకపోవడంతో ప్రతిష్టించకుండానే నిమజ్జనం చేశారు.