హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయాలి'

NRML: జిల్లాలో స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అంశాలపై చర్చించారు. అనంతరం అర్హత ఉన్న ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.