హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంట్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

విశాఖ: విశాఖ న్యూ రెసపువానిపాలెంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. CMR సెంట్రల్ ఎదురుగా ఇండియన్ పెట్రోల్ బంక్ పక్కన ఉన్న ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా, ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా అన్నది తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణలు తెలియాల్సి ఉంది.