హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు డిండిలో నాన్-సీడ్ వరి ధాన్యం బహిరంగ వేలం

NLG: గుండ్లపల్లి(డిండి)లోని విత్తనోత్పత్తి క్షేత్రంలో వరి కేఎన్ఎం-1638 రకానికి చెందిన నాన్-సీడ్ ధాన్యాన్ని గురువారం ఉదయం 11గంటలకు బహిరంగ వేలం ద్వారా విక్ర యించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 308.30 క్వింటాళ్ల ధాన్యాన్ని వేలం వేయనున్నారు. వేలంలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న వ్యాపారులు, రైతులు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించి పాల్గొనవచ్చని సూచించారు.