SKLM: టెక్కలి పట్టణం పాత నౌపడాలో జూద శిబిరంపై ఎస్సై రాము ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.18,300 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మంగళవారం తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. జూదం ఆడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఎస్ఐ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నలుగురు జూదరుల అరెస్ట్!


