WNP: వినాయక మండపాల వద్ద సైబర్ క్రైమ్ వివరాలతో కూడిన ఫ్లెక్సీలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆత్మకూరు ఎస్సై జయన్న సూచించారు. వినాయకుడి పెద్ద చెవులు, చిన్న కళ్లు, అభయహస్తం, మూషిక వాహనం, పొడవైన తొండం, చేతిలో కలం వంటి అంశాలతో సైబర్ భద్రతపై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. మండపాల నిర్వాహకులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
మండపాల వద్ద సైబర్ ఫ్లెక్సీలు తప్పనిసరి: ఎస్సై


