హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీ హాస్టళ్లలో గ్యాస్ స్టవ్ ఏర్పాటు చేయాలి'

MLG: ములుగు బీసీ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు పలుసమస్యలు ఎదుర్కొంటున్నారని SFI జిల్లాఅధ్యక్షుడు జాగటి రవితేజ తెలిపారు. బీసీ డీడీ రామ్మోహన్‌కు వినతిపత్రం అందజేశారు. హాస్టళ్లలో గ్యాస్ స్టవ్ లేక కట్టెలపొయ్యిపై వంటచేయడంతో ఆహారం సరిగా ఉడకడం లేదని, ఉదయం టిఫిన్ ఆలస్యమై విద్యార్థులు పాఠశాలలకు ఆలస్యంగా వెళ్తున్నారని పేర్కొన్నారు. వార్డెన్లు సమయపాలన పాటించాలన్నారు.