హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

KMR: గాంధారి మండల వ్యవసాయ అధికారి రాజలింగంపై చర్యలు తీసుకోవాలని గాంధారి మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన రైతులు కోరారు. మంగళవారం అడిషనల్ కలెక్టర్ విక్టర్‌కు కలిసి వినతిపత్రం అందజేశారు. యూరియా కోసం వ్యవసాయ అధికారిని ఫోన్‌లో సంప్రదించగా అసభ్యకరంగా మాట్లాడారని రైతులు ఆరోపించారు.