హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు గాంధీ భవన్‌లో ప్రజలను కలవనున్న మంత్రి

HYD: గాంధీ భవన్‌లో ప్రతి బుధవారం జరిగే ప్రజలతో ముఖాముఖీ కార్యక్రమం గురువారం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈ నెల 17న కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమంలో మంత్రి అజాహరుద్దీన్ పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.