SRCL: బోయిన్పల్లి మండలం మాన్వాడలోని మిడ్ మానేరు జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఉదయం 6 గంటలకు 24 గంటల సగటు ఇన్‌ఫ్లో 2,473 క్యూసెక్కులుగా నమోదైంది. నీటిమట్టం +315.67 మీటర్లకు, నీటి నిల్వ 21.910 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు. ప్రస్తుతం 170 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉండగా, స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసివేసి ఉన్నాయి.
తెలంగాణ
మిడ్ మానేరు ప్రాజెక్టులో కొనసాగుతున్న వరద ప్రవాహం


