హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడువులోగా టెండర్లను పూర్తి చేయాలని జిఎంకు వినతి

PDPL: రామగిరి, ఆర్జీ-3లో సెక్యూరిటీ టెండర్లను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టు కార్మిక సంఘం (ఐఎఫ్టీయూ) నాయకులు మంగళవారం జీఎం మధుసూదన్‌కు వినతిపత్రం ఇచ్చారు. టెండర్ల జాప్యంతో గార్డుల వేతనాల చెల్లింపులో ఇబ్బందులు వస్తున్నాయని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకన్న తెలిపారు. సకాలంలో పూర్తి చేస్తామని జీఎం హామీ ఇచ్చారన్నారు.