KMM: రఘునాథపాలెం మండలంలోని సుడా పార్కును బుధవారం ఉదయం సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గ ప్రసాద్‌తో కలిసి ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కులోని వసతులు, పారిశుధ్య నిర్వహణను తనిఖీ చేసిన ఆయన, ప్రస్తుతం అక్కడ ఉన్న సమస్యలు, త్వరలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
తెలంగాణ
సుడా పార్కును పరిశీలించిన కమిషనర్


