హైదరాబాద్: 28°C
తెలంగాణ

పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు.. ఇవాళ కూడా ఛాన్స్!

మెదక్: రాష్ట్రంలో చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ సాయంత్రం 5 వరకు పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో ఈ మేరకు ఒక్క రోజు ఛాన్స్ ఇచ్చింది. అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.