హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు

SKLM: పాతపట్నం మండల కేంద్రంలో వెలసిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారికి ఇవాళ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.