హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాను కరువు ప్రాంతంగా గుర్తించాలని తీర్మానం'

అనకాపల్లి జిల్లా అభివృద్ధిపై కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాను కరువు ప్రాంతంగా గుర్తించాలని సమావేశంలో తీర్మానించారు. కరువు పరిస్థితులను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. ఎమ్మెల్యేలు సుందరపు విజయ్‌కుమార్, కొణతాల రామకృష్ణ, పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు.