హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొద్దిపాటి వర్షానికే జలమయమైన అండర్‌పాస్

BHNG: ఇటీవల రెండు రోజులు కురిసిన ముసురు, కొద్దిపాటి వర్షానికి ఆలేరు పట్టణంలో రైల్వే గేట్ అండర్‌పాస్ వద్ద నీరు నిలిచిపోవడంతో పట్టణంలోని ద్విచక్ర వాహనాలు, కార్లు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొంతమంది వాహనదారులు చేసేదేమీ లేక ఆ వర్షపు నీటిలో నుంచే తడుచుకుంటూ మెయిన్ రోడ్ వైపు ప్రయాణించారు. అధికారులు స్పందించి తగిన ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.