హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

సంగారెడ్డి: హోటల్ మేనేజ్‌మెంట్‌పై ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేష్ కుమార్ తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువతి, యువకులు అర్హులని చెప్పారు. బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు.