హైదరాబాద్: 28°C
తెలంగాణ

పీత వర్ణంలో దర్శనమిచ్చిన సిద్ధి వినాయకుడు

SRD: పటాన్‌చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ ఆలయంలో బుధవారం పీత వర్ణంలో శ్రీ సిద్ధి వినాయక స్వామి దివ్య దర్శనమిచ్చారు. ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజున అర్చకులు వినాయక స్వామికి విశేష అభిషేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ధూప, దీప నైవేద్యం, మహా మంగళ హారతి సమర్పించారు. ఈ తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి వచ్చి దర్శించుకుంటున్నారు.