హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారి మరుగుదొడ్లలో అంధకారం

BPT: వాడరేవు-పిడుగురాళ్ల జాతీయ రహదారిపై ఉప్పుటూరు టోల్‌ప్లాజా వద్ద ఉన్న మరుగుదొడ్లలో లైట్లు వెలగక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ చీకటిగా ఉండటంతో పరిస్థితి దారుణంగా ఉందని వాపోతున్నారు. సమస్యపై టోల్ సిబ్బందిని ప్రశ్నించగా తమకు సంబంధం లేదని బాధ్యతారాహిత్యంగా మట్లాడారని ఆరోపించారు.