హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు స్థానిక ఎన్నికల ఓటర్లు జాబితాపై సమావేశం'

ELR: గణపవరం ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీల నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జి. రంగనాయకులు తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ప్రదర్శించిన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపై సమీక్షించి, అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు చెప్పారు.