హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలు పోరాటాల్లో ముందుకు రావాలి: మల్లు లక్ష్మి

JN: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం చూపిన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మంగళవారం జనగామ పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. మహిళలు ఎదుర్కొంటున్న హింస, వివక్ష, ఆర్థిక సమస్యలపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.