WNP: ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీని దొంగలు ఆసరాగా చేసుకుంటున్నారని డీఎస్పీ గిరిబాబు అన్నారు. కొత్తకోట, వనపర్తి, ఆత్మకూర్ బస్టాండ్లలో మహిళల పర్సులు, బంగారు ఆభరణాలు, చిన్నారుల గొలుసులు, సెల్‌ఫోన్లు చోరీ అవుతున్నాయి. బస్సులు ఎక్కి దిగే సమయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బస్టాండ్లలో నిఘా పెంచుతున్నామని డీఎస్పీ తెలిపారు.
తెలంగాణ
రద్దీ బస్సుల్లో దొంగల హల్‌చల్: డీఎస్పీ


