NZB: ఆర్మూర్ పట్టణంలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఐదుగురు పట్టుబడ్డారు. వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరచగా, నలుగురికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.40 వేల జరిమానా విధించారు. మరో వ్యక్తికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
తెలంగాణ
డ్రంక్ అండ్ డ్రైవ్.. రూ.40 వేల జరిమానా


