హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

MHBD: పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి శివారులో మంగళవారం ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ఉప్పల్ నుంచి తొర్రూరుకు వెళ్తున్న బస్సు వడ్డెకొత్తపల్లి వద్దకు చేరుకోగానే డ్రైవర్ పద్మయ్యకు కళ్లు తిరగడంతో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కకు వెళ్లింది. బస్సులో ఉన్న 21 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.