AKP: వర్షాభావ పరిస్థితులు నేపథ్యంలో ఆరుతడి పంటల సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా వ్యవసాయ అధికారిణి ఆశాదేవి కోరారు. తక్కువ నీటితో పండించే కొర్రలు, ఉలవలు, రాగులు, జనుము తదితర పంటలు వేసుకోవాలన్నారు. ఆరుతడి పంటలకు సంబంధించిన విత్తనాలను 80 శాతం రాయితీపై రైతులకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పంటల సాగుకు ముందుకు రావాలి'


