NLG: పట్టణంలోని 16వ డివిజన్ చర్లపల్లిలో ఏర్పాటు చేసిన వినాయక మండపం భక్తులను, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటేలా నిర్వాహకులు వినూత్న రీతిలో మండపాన్ని తీర్చిదిద్దారు. పచ్చని ప్రకృతి పరిసరాల మధ్య వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఈ మండపాన్ని చూడడానికి పట్టణ వ్యాప్తంగా ఉన్న భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.
తెలంగాణ
పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని చాటేలా గణపతి మండపం


