హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గుడుంబా తయారీ విక్రయాలను అరికట్టాలి'

ASF: దహెగం మండలంలోని లంబాడి తండా, కొంచవెళ్లి గ్రామాల్లో అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టాలని DYFA, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ASIకి వినతిపత్రం అందజేశారు. గుడుంబాకు బానిసై పురుషులు కుటుంబాలకు దూరమవుతున్నారని, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్రమ తయారీదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.