హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం మత్తులో గడ్డి మందు తాగి కూలీ మృతి...!

NLR: మద్యం మత్తులో గడ్డి మందును మద్యం అనుకుని సేవించడంతో ఓ గిరిజన వ్యవసాయ కూలీ మృతిచెందిన సంఘటన మనుబోలు మండలంలో చోటుచేసుకుంది. మనుబోలు మండలం లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సంజీవయ్య వ్యవసాయ కూలీ. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం అనుకుని పొరపాటున గడ్డి మందు తాగడంతో చికిత్స పొందుతూ మరణించారు.