BDK: దొంగిలించిన ఫోన్లు కొనుగోలు చేసినా, ఆధారాలు లేకుండా సాఫ్ట్‌వేర్ లేదా ఐఎంఈఐ మార్చినా కఠిన చర్యలు తప్పవని భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ హెచ్చరించారు. మంగళవారం మొబైల్ వ్యాపారులతో సమావేశమైన ఆయన, సరైన బిల్లులు లేని ఫోన్లు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే నేరంలో భాగస్వాములుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ
దొంగ ఫోన్లు కొంటే కఠిన చర్యలు: డీఎస్పీ


