హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొన్న SI

AKP: గొలుగొండ మండలం లింగంపేట పంచాయతీ గైరంపేట గ్రామంలో కృష్ణదేవిపేట ఎస్సై ఋషికేశ్వరరావు ఆధ్వర్యంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఆదేశాలు, నర్సీపట్నం డీఎస్పీ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ, మహిళల సంరక్షణ, సంబంధిత చట్టాలు, సైబర్ మోసాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు.